Bunny Fans Portal

Visit My New Blog

Tuesday, October 29, 2013

Bunny at Highway Race Gurram


హైవే పై అర్ద రాత్రి అల్లు అర్జున్ హంగామా

హైదరాబాద్: అల్లు అర్జున్‌ హైవే రోడ్డెక్కాడు. అదీ అర్ధరాత్రి సమయంలో... అసలా సమయంలో ఎక్కడ, ఎందుకు అనుకుంటున్నారా. రామోజీ ఫిల్మ్‌సిటీలోని హెలిప్యాడ్‌ జంక్షన్‌ వద్ద హైవే రోడ్డుపై ఉన్నాడు. అయితే అప్పుడే అటువైపు నుంచి కిక్‌శ్యామ్‌ తన పోలీసు కారులో పెట్రోలింగ్‌ చేస్తూ వెళ్లాడు. అసలు అల్లు అర్జున్‌ ఎందుకు అక్కడ ఉన్నాడనేది తెలియాలంటే మాత్రం 'రేసుగుర్రం' సినిమా చూడాల్సిందే అంటున్నారు సురేందర్‌రెడ్డి. అల్లు అర్జున్‌, కిక్‌ దర్శకుడు సురేందర్‌ రెడ్డి కాంబినేషన్లో ‘రేసు గుర్రం' సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఆయన దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని నల్లమలుపు శ్రీనివాస్‌(బుజ్జి) నిర్మిస్తున్నారు. శ్రుతి హాసన్‌, సలోని హీరోయిన్స్. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం సంక్రాంతి (జనవరి 11)రిలీజ్ కానున్నదని తెలుస్తోంది. అదే సంక్రాంతికి...మహేష్ 1 నేనొక్కడినే,బాలకృష్ణ లెజండ్ చిత్రాలు విడుదల అవుతాయి.
రేసుగుర్రం చిత్రం గత సంవత్సరం అక్టోబర్లోనే ఈ చిత్రం అఫీషియల్‌గా ప్రారంభోత్సవం జరుపుకుంది. అయితే రకరకాల కారణాల వల్ల లేటయ్యి....ఇప్పుడు షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రంలో అల్లు అర్జున్ బైక్ రేసర్ గా కనిపించనున్నారని తెలుస్తోంది. బన్నీ ఆ సీన్స్ కోసం బైక్ రేస్ ట్రైనింగ్ అయ్యినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌సిటీలోని రోడ్లపై రౌడీల పనిపడుతున్నాడు. రామ్‌లక్ష్మణ్‌ నేతృత్వంలో గోవాహౌస్‌ రోడ్లపై ఈ ఫైట్ సీన్స్ చిత్రీకరిస్తున్నారు. ఇది శ్రుతిహాసన్‌ జంటగా నటిస్తోన్న 'రేసుగుర్రం' కోసం. ఇందులో సలోని కీలక పాత్రలో నటిస్తోంది. సురేందర్‌రెడ్డి దర్శకుడు. నల్లమలుపు బుజ్జి, డా||వెంకటేశ్వరరావు నిర్మాతలు. మరో రెండు రోజుల పాటు ఇక్కడ చిత్రీకరిస్తారు. ఇప్పటికే లేట్ కావటంతో ఈ సినిమా షూటింగ్ చాలా వేగంగా జరుపుతున్నారు. ఈ చిత్రానికి టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకరైన తమన్ సంగీతం అందిస్తున్నారు. తమన్ ఇచ్చిన మ్యూజిక్‌పై తన అభిప్రాయాన్ని వెలుబుచ్చాడు అల్లు అర్జున్. ఫేస్‌బుక్‌లో అల్లు అర్జున్ స్పందిస్తూ...‘రేస్ గుర్రం చిత్రం కోసం తమన్ ఎక్సలెంట్ సాంగ్స్ ఇచ్చాడు. సినిమా ఆడియో విడుదల ఎప్పుడు జరుగుతుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. పాటలు సూపర్ హిట్టవడం ఖాయం' అంటూ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. కిక్‌ సినిమాతో హిట్ కొట్టి స్టార్ దర్శకుడిగా మారిన సురేందర్ రెడ్డి, ఆ తర్వాత ఊసరవెల్లితో బోల్తా పడ్డాడు. అయితే ఈచిత్రంతో ఎలాగైనా హిట్ హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడ. పేరుకు తగ్గట్టు అల్లు అర్జున్‌ పాత్ర తీరు జెట్‌ స్పీడుతో ఉంటుందని చెప్తున్నారు. వినోదం, యాక్షన్‌ల మేళవింపు కథలో కనిపిస్తుందని యూనిట్ చెబుతోంది. ఇటీవలే విదేశాల్లో రెండు పాటల్ని చిత్రీకరించారు. ఈ చిత్రానికి తమన్‌ సంగీతం అందిస్తున్నారు.మాటల్లో చెప్పలేనిది చూపించాం అని చెప్తున్నారు. ఈ సినిమా కొన్ని షెడ్యూల్స్ మిగిలివున్నాయి. వాటిని కూడా అనుకున్న సమయానికి పూర్తి చేయడానికి వేగంగా పనులను పూర్తి చేస్తున్నారు. ఇప్పటి వరకు ఈ సినిమా ప్రొడక్షన్ టీం ఈ సినిమాకు సంబందించిన ఎటువంటి ప్రకటన చేయలేదు. నల్లమలుపు బుజ్జి, కె. వెంకటేశ్వరరావు సంయుక్తంగా ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కథ : వక్కతం వంశీ, సంగీతం : తమన్, సినిమాటోగ్రఫీ : మనోజ్ పరమహంస, ఎడిటింగ్ : గౌతం రాజు, నిర్మాతలు : నల్లమలుపు శ్రీనివాస్, వెంకటేశ్వర రావు, దర్శకత్వం : సురేందర్ రెడ్డి అత్యుత్తమ, నాణ్యమైన వార్తలను అందిస్తున్న వన్ఇండియా... ఇప్పుడు మీకోసం ఫేస్‌బుక్, ట్విట్టర్‌ ల ద్వారా మరిన్ని అప్‌డేట్స్

English Summary 

Allu Arjun is currently shooting for Race Gurram in Hyderabad and the filmmakers are planning to release the film on January 11 for Pongal as per the latest buzz. Race Gurram has already completed a couple of major schedules in Europe and Hyderabad earlier. Shruti Haasan is romancing Allu Arjun in the action entertainer while Saloni will be seen in a prominent role. The action sequences of the film are currently being canned under the supervision of noted choreographers Ram - Lakshman are supervising the action scenes.

No comments:

Post a Comment

Thanks for your Comment

Related Posts Plugin for WordPress, Blogger...