Bunny Fans Portal

Visit My New Blog

Friday, April 18, 2014

Will Bunny & Charan Campaign Congress


హైదరాబాద్: సినీ తారల రంగ ప్రవేశంతో రాష్ట్రంలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. టాలీవుడ్ టాప్ స్టార్లయిన పవన్ కళ్యాన్, మహేష్ బాబు, బాలకృష్ణ, నాగార్జున, రామ్ చరణ్, అల్లు అర్జున్ లాంటి స్టార్లు ఈ సారి రాజకీయ ప్రచారంలోకి దిగారు. ఓ వైపు రాష్ట్రంలో విభజన తర్వాత ఏర్పడిన ప్రత్యేక పరిస్థితిలో.....సినీ స్టార్లు రంగంలోకి దిగాల్సిన అవసరాన్ని గుర్తించిన రాజకీయ పార్టీలు ఈ మేరకు వారిని కన్విన్స్ చేసి సక్సెస్ అయ్యాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘జనసేన' పార్టీని ఇప్పుడు స్థాపించడానికి ప్రధాన కారణంగా రాష్ట్ర విభజన తర్వాత ఏర్పడిన పరిస్థితులే అని చెప్పక తప్పదు. ఒక వేళ రాష్ట్ర విభజన ఇప్పుడు జరిగి ఉండకపోతే పవన్ కళ్యాణ్ పార్టీ కూడా ఇంత ఆఘమేఘాల మీద వచ్చి ఉండేదికాదేమో.....! తాను ఇప్పటికిప్పుడు పోటీకి దిగితే లాభం లేదని భావించిన పవన్ కళ్యాణ్.... కాంగ్రెస్ పార్టీపై ఉన్న కసిని టీడీపీ, బీజేపీకి తన మద్దతు ప్రకటించడం ద్వారా తీర్చుకుంటున్నారు. కాగా......పవన్ కసిగా ఉన్న కాంగ్రెస్ పార్టీని ఎన్నికల్లో గట్టెక్కించేందుకు పవన్ సోదరుడు చిరంజీవి తన శక్తిని అంతా ఉపయోగిస్తున్నారు. టీడీపీ, బీజేపీని అధికారంలోకి తేవడానికి పవన్ కళ్యాణ్‌‌‌కు బాలయ్య ఏకమైతే...... కాంగ్రెస్ తరుపున ఒంటరి పోరు సాగిస్తున్న చిరంజీవికి రామ్ చరణ్ మద్దతు ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. నాన్నకు అండగా రామ్ చరణ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉందని తెలుస్తోంది. రామ్ చరణ్‌కు తోగా ఎన్నికల ప్రచారంలో అల్లు అర్జున్ కూడా దిగుతాడని ప్రచారం జరుగుతోంది.


అత్యుత్తమ, నాణ్యమైన వార్తలను అందిస్తున్న వన్ఇండియా... ఇప్పుడు మీకోసం ఫేస్‌బుక్, ట్విట్టర్‌ ల ద్వారా మరిన్ని అప్‌డేట్స్

English Summary 


Source said that, Tollywood stars Ram Charan and Allu Arjun campaign for Congress.



No comments:

Post a Comment

Thanks for your Comment

Related Posts Plugin for WordPress, Blogger...