Bunny Fans Portal

Visit My New Blog

Sunday, December 08, 2013

Bunny about Race Rurram


అల్లు అర్జున్... 'బూచోడోయ్‌...'

హైదరాబాద్ :అల్లు అర్జున్ కి బూచోడికి సంభంధం ఏమిటనేది ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్ లోనూ బన్ని ఫ్యాన్స్ లోనూ ఉత్పన్నమైన ప్రశ్న. బన్నీ హీరోగా గా తెరకెక్కుతున్న చిత్రం 'రేసుగుర్రం'. శ్రుతిహాసన్‌, సలోని హీరోయిన్స్. సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. సురేందర్‌రెడ్డి జన్మదినం సందర్భంగా సినిమా ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశారు. గంభీరమైన నేపథ్య సంగీతంతో 'బూచోడోయ్‌...' అంటూ ఓ గాత్రం వినిపిస్తుంటుంది. చీకట్లోంచి హీరో పరిగెత్తుతూ వస్తుంటాడు. టైటిల్‌లో రేసుకి సిద్ధంగా ఉన్న గుర్రం తల, అల్లు అర్జున్‌ కనిపించేలా పెట్టారు. పాత్ర ఎలా ఉంటుందో మీరే ఆలోచించండి అంటూ ప్రేక్షకులకు రుచి చూపించివిడిచిపెట్టారు. దాంతో ఇప్పుడు అంతటా 'బూచోడోయ్‌...' అని ఎందుకు అన్నారు అనేదే హాట్ టాపిక్ గా మారింది. దానికి తోడు గతంలో ఈ చిత్రానికి బూచోడు అనే టైటిల్ పెడతారనే ప్రచారమూ జరిగింది. ఈ చిత్రం గురించి అల్లు అర్జున్ మాట్లాడుతూ... పోటీకి సిద్ధమైన కుర్రాడు ఎలా ఉంటాడు... చీకట్లను చీల్చుకుంటూ, ప్రత్యర్థుల కళ్లలో భయాన్ని పెంచుతూ, కదన రంగంలోకి దిగుతున్న సైనికుడిలా ఉంటాడు. ఇంకా చెప్పాలంటే మా సినిమాలో హీరోలా ఉంటాడు అంటున్నారు ‌. నల్లమలుపు శ్రీనివాస్‌ (బుజ్జి), కె.వెంకటేశ్వరరావు నిర్మాతలు. యాక్షన్‌, ప్రేమ, వినోదాల్ని మేళవించిన ఈ చిత్రాన్ని ఫిబ్రవరిలో విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. తమన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. సురేంద్రరెడ్డి మాట్లాడుతూ... "పరుగు పందెంలో గెలవడం రేసుగుర్రం విధి. జీవితమనే పరుగు పందెంలో గెలవడం మనిషి విధి. అయితే... ఈ రేసులో అడపాదడపా గెలిచేవారు కొందరైతే... గెలుపుని ఇంటిపేరుగా మార్చుకున్నవాళ్లు కొందరు. ఆ కొందరిలో ఒకడి కథే... ‘రేసుగుర్రం. బాధ్యతాయుతమైన ఓ యువకుని కథాంశంతో సురేందర్‌రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ శక్తిమంతమైన పాత్ర పోషిస్తున్నారు" అన్నారు. కోట శ్రీనివాసరావు, సుహాసిని మణిరత్నం, ప్రకాష్‌రాజ్, అలీ, ఎమ్మెస్ నారాయణ, రఘుబాబు, ముఖేష్‌రుషి, ఆశిష్ విద్యార్థి, నవాజ్ సోనూ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి రచన: వక్కంతం వంశీ, కెమెరా: మనోజ్ పరమహంస, సంగీతం: ఎస్.తమన్, కూర్పు: గౌతంరాజు, నిర్మాతలు: నల్లమలుపు శ్రీనివాస్(బుజ్జి), డా.కె.వెంకటేశ్వరరావు, నిర్మాణం: శ్రీలక్ష్మీనరసింహా ప్రొడక్షన్స్. అత్యుత్తమ, నాణ్యమైన వార్తలను అందిస్తున్న వన్ఇండియా... ఇప్పుడు మీకోసం ఫేస్‌బుక్, ట్విట్టర్‌ ల ద్వారా మరిన్ని అప్‌డేట్స్

English Summary 


After an average flick Idharammayilatho, Allu Arjun is currently working for his next flick 'Race Gurram', under the direction of Surender Reddy. Director Surender Reddy is going to show a new angle of Allu Arjun in this flick. Sruthi Haasan is going to sizzle opposite Bunny and Kick Shyam is portraying an important role. Nallamalapu Bujji and Dr. K. Venkateshwara Rao are producing this film.

No comments:

Post a Comment

Thanks for your Comment

Related Posts Plugin for WordPress, Blogger...