Bunny Fans Portal

Visit My New Blog

Thursday, April 10, 2014

Will Race Gurram Beat Charan's Yevadu 1st Day Collections


హైదరాబాద్: అల్లు అర్జున్ తాజా చిత్రం "రేసు గుర్రం" 1050 థియోటర్స్ తో ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు విడుదల అవుతోంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం తొలి రోజు భాక్సాఫీస్ కలెక్షన్స్ తో రకరకాల అంచనాలు అంతటా నెలకొని ఉన్నాయి. ముఖ్యంగా ట్రేడ్ వర్గాల్లో ఈ చిత్రం "ఎవడు" మొదటి రోజు కలెక్షన్స్ ని బీట్ చేస్తుందా లేదా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 2014 సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన "ఎవడు" తొలిరోజు 8.65 కోట్లు సాథించింది. దాంతో ఇప్పుడు రేసుగుర్రం ఆ మొత్తాన్ని బీట్ అవుట్ చేస్తుందా లేదా అన్నది అభిమానుల్లో ప్రశ్న. అయితే "రేసు గుర్రం" కి పాజిటివ్ బజ్ ఉండటం కలిసివచ్చే అంశం అంటున్నారు. సురేంద్రరెడ్డి మాట్లాడుతూ..."గెలుపు కోసం బరిలో దిగినవాడికి... లక్ష్యం మాత్రమే కనిపించాలి. ఎదురొస్తున్న సవాళ్లు, పరిగెట్టిస్తున్న పరిస్థితులు, చుట్టుముడుతున్న సమస్యలూ ఇవేమీ పట్టించుకోకూడదు. రేసులో నిలవాలన్నా, నిలిచి గెలవాలన్నా పోరాడాల్సిందే. ఆ యువకుడూ అదే చేశాడు. 'రేసు గుర్రం'లా దూసుకుపోయాడు. మరి విజయం అందిందా? లేదా? ఇంతకీ ఈ రేసు దేని కోసం? తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే!" అన్నారు నిర్మాతలు మాట్లాడుతూ "బన్ని కెరీర్‌లో ఫుల్‌లెంగ్త్ ఎంటర్‌టైనర్‌గా నిలుస్తుంది. ఆద్యంతం నవ్వులు పండిస్తూనే ఉంటుంది. వినోదం, యాక్షన్‌ మేళవించిన కథ ఇది. టైటిల్‌కి తగ్గట్టే.. హుషారుగా సాగిపోతుంది'' అని అన్నారు. ఈ చిత్రానికి తమన్‌ సంగీతం అందిస్తున్నారు. "పరుగు పందెంలో గెలవడం రేసుగుర్రం విధి. జీవితమనే పరుగు పందెంలో గెలవడం మనిషి విధి. అయితే... ఈ రేసులో అడపాదడపా గెలిచేవారు కొందరైతే... గెలుపుని ఇంటిపేరుగా మార్చుకున్నవాళ్లు కొందరు. ఆ కొందరిలో ఒకడి కథే... ‘రేసుగుర్రం. బాధ్యతాయుతమైన ఓ యువకుని కథాంశంతో సురేందర్‌రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ శక్తిమంతమైన పాత్ర పోషిస్తున్నారు" నాణ్యమైన వార్తలను అందిస్తున్న వన్ఇండియా... ఇప్పుడు మీకోసం ఫేస్‌బుక్, ట్విట్టర్‌ ల ద్వారా మరిన్ని అప్‌డేట్స్



English Summary 

Ram Charan's "Yevadu" minted 8.65 crore share in its opening day and made it to the list of all time top 10 AP day 1 share. "Race Gurram," which is carrying positive reports, is expected to post good collections on the first day.

No comments:

Post a Comment

Thanks for your Comment

Related Posts Plugin for WordPress, Blogger...