Bunny Fans Portal

Visit My New Blog

Thursday, January 24, 2013

Iddarammayilatho Story Line

Bunny S Iddarammayilatho Story Line
 
హైదరాబాద్ : అల్లు అర్జున్, పూరీ జగన్నాధ్ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం 'ఇద్దరమ్మాయిలతో' . ఈ చిత్రం కాన్సెప్టు ఏమిటంటే...తనని తాను ప్రేమించుకోవడమే కాదు... ఆ ప్రేమని మరొకరికి పంచడం కూడా తెలిసిన కుర్రాడతను. ఒకరికి వాటా ఇస్తే... ఇబ్బంది లేకపోదును. ప్రేమ మరీ ఎక్కువైపోయి... ఒకేసారి ఇద్దరికి మనసిచ్చేశాడు. ఆ ప్రేమాయణం ఏ తీరానికి చేరిందో తెలియాలంటే 'ఇద్దరమ్మాయిలతో' సినిమా చూడాలి అని చెప్తున్నారు.
అమలాపాల్‌, కేథరిన్‌ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ చిత్రానికి బండ్ల గణేష్‌ నిర్మాత. బ్యాంకాక్‌లో ముఖ్య సన్నివేశాల్ని చిత్రీకరించారు. 'ఇడియట్‌', 'దేశముదురు' తరవాత ఓ పూర్తిస్థాయి ప్రేమ కథని తెరపై చూపిస్తున్నారు పూరి. ఇద్దరు హీరోయిన్స్ తో నటించడం అల్లు అర్జున్‌కీ ఇదే తొలిసారి. ఈ సినిమా కోసం అమలాపాల్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ నేర్చుకొంది. బ్యాంకాక్‌లో ఆమెపై ఓ పోరాట సన్నివేశం కూడా తీర్చిదిద్దారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు.
‘ఇద్దరమ్మాయిలతో' ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. గత కొన్ని రోజులుగా ఈచిత్రం బ్యాంకాక్‌లో షూటింగ్ జరుపుకుంది. దర్శకుడు పూరి జగన్నాథ్ 30 రోజుల్లో థాయ్ లాండ్ షెడ్యూల్ పూర్తి చేసారు. ఈ నెల రోజుల పాటు థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్ తో పాటు పలు ప్రాంతాల్లో షూటింగ్ నిర్వహించారు.
షూటింగ్ పూర్తి కావడంతో యూనిట్ సభ్యులంతా హైదరాబాద్ బయల్దేరారు. ఈచిత్రం తర్వాతి షెడ్యూల్ స్పెయిన్లో ప్లాన్ చేస్తున్నారు. నిర్మాత బండ్ల గణేష్ ఖర్చుకు వెనకాడకుండా బన్నీ ఇమేజ్ కు తగిన విధంగా స్టైలిష్ గా ఈచిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో బన్నీనీ లవర్ బాయ్‌లా చూపెట్టబోతున్నాడు దర్శకుడు పూరి. దేవిశ్రీప్రసాద్‌ దీనికి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: శ్యామ్‌.కె.నాయుడు, నృత్యాలు: దినేష్‌, కళ: చిన్నా, కూర్పు: ఎస్‌.ఆర్‌.శేఖర్‌, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌. కో-రైటర్స్: బి.వి.ఎస్. రవి, కళ్యాణ్‌ వర్మ.
 
English Summary
 
The unit of Allu Arjun-starrer Iddarammayilatho has just wrapped up the first schedule of shooting in Bangkok. Director Puri Jagannath has completed the first schedule in 30 days in Thailand and surrounding areas, where he shot scenes on Allu Arjun, Amala Paul, Catherine, Brahmanandam and others.

No comments:

Post a Comment

Thanks for your Comment

Related Posts Plugin for WordPress, Blogger...