Bunny Fans Portal

Visit My New Blog

Tuesday, January 01, 2013

బంధువుల ద్వారా అల్లు అర్జున్ పరిచయం, మలుపు తిప్పింది

 
Maruthi About His Relation With Bunny హైదరాబాద్ : 1998లో బంధువుల ద్వారా బన్నీ (అల్లు అర్జున్) పరిచయమయ్యారు. ఆ పరిచయమే కెరీర్‌ను మలుపుతిప్పింది. అంజి, అమ్మోరు చిత్రాలకు గ్రాఫిక్స్‌ను అందించే అవకాశం వచ్చింది. 2003లో బన్నీ, వాసుతో కలిసి ఆర్య, 7/జీ బృందావన్‌కాలనీ, భద్ర సిని మాలకు డిస్ట్రిబ్యూషన్ బాధ్యతలు చేపట్టా అంటున్నారు దర్శక,నిర్మాత మారుతి. 2012 లో ఈ రోజుల్లో, బస్ స్టాప్ చిత్రాలతో సక్సెస్ సాధించిన మారుతి తన ప్రస్దానాన్ని వివరిస్తూ ఇలా వివరించారు.అలాగే 2004లో ఫిల్మ్ బై అరవింద్, ప్రేమిస్తే సినిమాలకు కో-ప్రొడ్యుసర్‌గా ఉన్నా. సినిమా డెరైక్షన్ చేయాలనే కోరిక నాలో బలంగా ఉండేది. గతంలో షార్ట్‌ఫిల్మ్‌లు తీసిన అనుభవం దృష్ట్యా డెరైక్షన్ చేయగలనన్న నమ్మకం ధృడంగా ఉండేది. 2009 లోనే బస్‌స్టాప్ సినిమా స్క్రిప్ట్‌ను రెడీ చేసుకున్నాను. ఏడాదిన్నర పాటు నిర్మాతల చుట్టూ తిరిగాను. ఫలితం లేదు. ఈ క్రమంలోనే ‘ఈ రోజుల్లో' సినిమా స్క్రిఫ్ట్ కూడా రెడీ అయిపోయింది అన్నారు.ఇక నిర్మాతలు ఎవరూ దొరకక పోయేసరికి నా దగ్గర ఉన్న డబ్బులతోనే సినిమా తీయాలని నిర్ణయించుకున్నా. గుడ్ ఫిలిం గ్రూపు పేరిట కొంతమంది స్నేహితులు కలిసి ‘ఈ రోజుల్లో' సినిమాను తెరకెక్కించాం. సరదాగా చేసిన సినిమా పెద్ద హిట్ కావ డం ఆనందాన్ని ఇచ్చింది. ఆ సక్సెస్ అందించిన ‘ఎనర్జీ'తో రెడీగా ఉన్న ‘బస్‌స్టాప్'ను తెరకెక్కించా. 2012 అందించిన సక్సెస్ మరిచిపోలేనిది.' అని చెప్పుకొచ్చారు మారుతి.మచిలీపట్నంలో నా చిన్నతనంలో రోడ్ల మీదనే ఎక్కువగా గడిపా. సినిమాలంటే విపరీతమైన పిచ్చి. చిరంజీవంటే మరీనూ. . సిని మాలంటే మక్కువ ఉండడంతో పాటు యానిమేషన్ రంగానికి ప్రాధాన్యం ఉండనే ఉంది. ఇం కేం.. తాను కూడబెట్టిన డబ్బులతో హైదరాబాద్ వచ్చేసి 2డీ యానిమేషన్ కోర్సు పూర్తి చేశా. 2డీ యానిమేషన్ పూర్తి చేసిన తరువాత కొన్నాళ్ల పాటు ఉద్యోగం చేశా. అదే సమయంలో కుటుంబాన్ని హైదరాబాద్‌కు తీసుకువచ్చేశా అని చెప్పారు.

 
English Summary
 
Director Maruthi says, "After seeing RGV's Dongala Mutha, I narrated a few stories but people showed no interest. I then bought a 5D and started off on my own with 50 lakhs but went over board by 10 lakhs, but I was sure on spending on publicity as this was a small film. I have a grip and an understanding as I directed ad films for Praja Rajyam Party. They encouraged me but I never took the liberty to ask them for an opportunity to make a movie."

No comments:

Post a Comment

Thanks for your Comment

Related Posts Plugin for WordPress, Blogger...