హైదరాబాద్: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల తండ్రైన సంగతి తెలిసిందే. ఆయన భార్య స్నేహారెడ్డి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ శుభ సందర్భాన్ని తన స్నేహితులు, సన్నిహితులతో కలిసి సెలబ్రేట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. నిన్న అల్లు అర్జున్ పుట్టినరోజు కూడా కావడంతో హైదరాబాద్ శివారులోని ఓ రిసార్టులో గ్రాండ్‌గా పార్టీ ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. ఇక తమ బిడ్డకు ఏం పేరు పెట్టాలి, ఏ అక్షరం మీద స్టార్ అయితే బాగుంటుంది అనే దానిపై అల్లు అర్జున్ అన్వేషణ జరుపుతున్నారు. ఈ మేరకు సన్నిహితులు, జ్యోతిష్య నిఫుణుల సలహాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో ట్రెండీ, భిన్నంగా ఉండే విధంగా పేరు ప్లాన్ చేస్తున్నారట. ఆ సంగతి పక్కన పెడితే అల్లు అర్జున్ నటించిన ‘రేసు గుర్రం' చిత్రం ఈ నెల 11న విడుదలకు సిద్ధమవుతోంది. అల్లు అర్జున్, శృతి హాసన్ జంటగా నటించిన ఈచిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈచిత్రం సెన్సార్ బోర్డు నుండి U/A సర్టిఫికెట్ పొందింది. నల్లమలుపు బుజ్జి, డాక్టర్ వెంకటేశ్వరరావు సంయుక్తంగా ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా....అల్లు అర్జున్ తర్వాతి చిత్రానికి కూడా ముమూర్తం ఖరారైంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించబోతున్న ఈచిత్రాన్ని ఏప్రిల్ 10న లాంఛనంగా ప్రారంభించబోతున్నారు. రాధాకృష్ణ నిర్మాత. హారిక హాసిని క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కబోతోంది. సమంతను హీరోయిన్‌గా ఎంపిక చేసారు. దేవిశ్రీప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించబోతున్నారు. అత్యుత్తమ, నాణ్యమైన వార్తలను అందిస్తున్న వన్ఇండియా... ఇప్పుడు మీకోసం ఫేస్‌బుక్, ట్విట్టర్ ల ద్వారా మరిన్ని అప్‌డేట్స్.
English Summary
Allu Arjun has gave a grand birthday party for his friends at his farmhouse on the outskirts of Hyderabad. The actor recently became a dad and that is also one of the reasons for the party.
No comments:
Post a Comment
Thanks for your Comment