హైదరాబాద్ : అల్లు అర్జున్ గోన గన్నారెడ్డిపాత్రలో నటిస్తున్న సినిమా ‘రుద్రమదేవి'. గోనగన్నా రెడ్డిగా అల్లు అర్జున్ పై విడుదల చేసిన ఫస్ట్ లుక్ కి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసింది. ఈ నేపధ్యంలో రుద్రమదేవికి సంబందించిన బన్ని మేకింగ్ వీడియోను విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్ర టీం సంక్రాంతి కానుకగా జనవరి 15వ తేదీ ఉదయం 9 గంటలకు రిలీజ్ చేస్తున్నామని ప్రకటించారు. గోనగాన్నా రెడ్డి పాత్రకి జోడీగా కేథరిన్ ట్రేసా కనిపించనుంది. అయితే చిత్రంలో అల్లు అర్జున్ ది చిన్న ఎపిసోడ్ మాత్రమే. సినిమా మొత్తం అనుష్క,రానా చుట్టూ తిరుగుతుంది అంటున్నారు. అలాగే... ఈ చిత్రంలో తమ సినిమాలో ముందు అనుకున్న గోన గన్నారెడ్డి పాత్రను అల్లు అర్జున్ రాగానే పెంచినట్లు సమాచారం. అలాగే మీడియాలో కూడా అల్లు అర్జున్ ఈ చిత్రంలో చేస్తున్న విషయం బాగా నలిగేటట్లు దర్శక,నిర్మాతలు చూసుకుంటున్నారు.
అనుష్క ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం 'రుద్రమదేవి'. రానా, అల్లు అర్జున్, కేథరిన్ ముఖ్య పాత్రధారులు. గుణశేఖర్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. దేశంలోనే తొలిసారిగా స్టీరియో స్కోపిక్ త్రీడీ విధానంలో తెరకెక్కుతున్న చిత్రమిది. నిర్మాత మాట్లాడుతూ... ''కాకతీయుల కాలాన్ని దర్శకుడు కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నారు. గోన గన్నారెడ్డి పాత్రలో అల్లు అర్జున్ నటన చిత్రానికి కలిసొస్తుంది. అనుష్క, అల్లు అర్జున్ మధ్య చిత్రిస్తున్న సన్నివేశాలు చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి'' అంటున్నారు.
గుణ శేఖర్ మాట్లాడుతూ... ''కాకతీయుల చరిత్రలో గోన గన్నారెడ్డి పాత్రకు ప్రముఖ స్థానముంది. ప్రజల సంక్షేమం కోసం పోరాడిన ఓ వ్యక్తి పాత్ర అది. ఈ పాత్రకు ఎవరు సరితూగుతారా అని ఆలోచిస్తుండగా అల్లు అర్జున్ గుర్తొచ్చాడు. పాత్రకు కావాల్సిన అన్ని అంశాలు ఉన్న కథానాయకుడతను. ఈ కథ గురించి చెప్పగానే అతడు కూడా వెంటనే అంగీకరించాడు. దీంతో నేటి తరం హీరోలలో ఇలాంటి పాత్రలు పోషించడానికి నాంది పలికినవాడిగా బన్నీ నిలుస్తాడు. ఎన్టీఆర్‌కు 'పల్నాటి బ్రహ్మనాయుడు'లా, ఏఎన్నార్‌కు 'తెనాలి రామకృష్ణుడు'లా, కృష్ణంరాజుకు 'తాండ్రపాపారాయుడు'లా, కృష్ణకు 'అల్లూరి సీతారామరాజు'లా బన్నీకి మా 'రుద్రమదేవి' సినిమా నిలిచిపోతుంది.'' అంటూ వివరించారు గుణశేఖర్. ఈ సినిమాలో అనుష్క, రానా, నిత్యమీనన్, కృష్ణంరాజు ఇతర ముఖ్య పాత్రల్లో కనిపిస్తారు. ఈ చిత్రానికి సంగీతం : ఇళయరాజా, ఆర్ట్: తోట తరణి, ఫోటోగ్రపీ : అజయ్ విన్సెంట్, కాస్టూమ్స్ : నీతా లుల్లా(జోధా అక్భర్ ఫేం), ఎడిటింగ్ : శ్రీకర్ ప్రసాద్, విఎఫ్ ఎక్స్ : కమల్ కణ్ణన్, మాటలు : పరుచూరి బ్రదర్స్, పాటలు : సిరివెన్నెల, మేకప్ : రాంబాబు, నిర్మాత-కథ-స్ర్కీన్ ప్లే-దర్శకత్వం : గుణ శేఖర్.'.
English Summary
This Sankranthi, a new making video of Allu Arjun as Gona Gannareddy will be unveiled.
No comments:
Post a Comment
Thanks for your Comment