హైదరాబాద్ : ధనవంతుల కుటుంబాల్లో పుట్టిన వారికి డబ్బు విలువ తెలియదంటారు. కానీ నేను అలాంటి వాడిని కాదు అంటున్నాడు హీరో అల్లు అర్జున్. టాలీవుడ్లో బడా నిర్మాత తనయుడిగా, సంపన్నుల కుటుంబం పుట్టిన అల్లు అర్జున్ కష్టపడి పని చేసి సంపాదించే ప్రతి రూపాయి విలువ తనకు తెలుసు అంటున్నాడు.
ఓ ప్రతికకు ఇచ్చిన ఇంటర్వ్కూలో బన్నీ మాట్లాడుతూ....‘దర్శకుడు పూరి జగన్నాథ్‌కు, నాకు మధ్య గతంలో డబ్బు విషయం చర్చకు వచ్చింది. హైదరాబాద్ లో కోటి రూపాయలు అనే మాటకి విలువ లేకుండా పోయిందిప్పుడు. వందల కోట్లు, వేల కోట్లు అంటూ పత్రికల్లో వస్తున్న వార్తల్ని చదువుతున్నాం. కోటి అనే మాట ఇప్పుడు వీడియో గేమ్ లో ఓ నెంబర్ లా, ఓ జోక్ లా మారిపోయింది. ఐదొందల రూపాయల నోటుని చేత్తో పట్టుకుని కాసేపు తదేకంగా చూస్తే ఇప్పటికీ నాకు కన్నీళ్లొస్తాయి. ప్రతి రూపాయి విలువైదే సార్' అన్నాను. ఆ మాట వినగానే పూరి కదిలిపోయారు.
నేను ధనవంతుల కుటుంబంలో పుట్టినా నా మనసు మధ్యతరగతే. మా కుటుంబానికి ఎంత పేరున్నా...మేం మాత్రం మధ్య తరగతి జీవితాన్ని అనుభవించే వచ్చాం. చెన్నైలో పుట్టి పెరిగాను. సైకిల్ తొక్కుకుంటూ వెళ్లి పాలు కొని తెచ్చేవాణ్ని. ఇంట్లో పనులు మాకు మేమే చేసుకునే వాళ్లం. ఐదొందల రూపాయలతో వారం పాటు సర్దుకొంటూ గడిపే మధ్య తరగతి జీవితాల గురించి నాకు బాగా తెలుసు. అని చెప్పుకొచ్చారు బన్నీ.
అల్లు అర్జున్, అమలపాల్, కేథరిన్ హీరో హీరోయిన్లుగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ‘ఇద్దరమ్మాయిలతో' చిత్రం ఈ నెల 31న విడుదలవుతున్న నేపథ్యంలో...ఈ సినిమా విశేషాల గురించి వివరిస్తూ ఈ చిత్రంలో గిటార్ వాయిద్య కారుడిగా కనిపిస్తాను. లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టెనర్. ఓ కుర్రాడి జీవితంలోకి ఇద్దరమ్మాయిలు ఎలా ప్రవేశించారనేది ఆసక్తికరం అన్నారు. పూరితో నాకు మంచి అనుబంధం ఉంది. ఆయన వద్ద చాలా నేర్చుకున్నాను. ఈ సినిమా పూరి నాపై చూపిన ప్రేమగా చెప్పుకోవచ్చు. దేశ ముదురు తర్వాత మళ్లీ ఆయనతో పని చేయడం ఆనందంగా ఉంది అని అల్లు అర్జున్ చెప్పుకొచ్చారు.
English Summary
“This movie is an expression of Puri’s love for me. He really is a joy to work with”, said Allu Arjun. Puri-Allu Arjun combination movie 'Iddarammayilatho' is all set for its theatrical release on the 31st of this month. The film directed by Puri Jagannadh starring Allu Arjun, Amala Paul and Catherine Tresa in the lead roles. Bandla Ganesh is producing this film under Parameswara art Productions.
No comments:
Post a Comment
Thanks for your Comment