హైదరాబాద్ : ''వూహ తెలిసినప్పట్నుంచీ నా చుట్టూ సినిమా వాతావరణమే. అయినా సరే... ఏ రోజూ హీరోని కావాలనే ఆలోచన రాలేదు. యానిమేషన్ నేర్చుకొంటూ నాదైన లోకంలో నేను గడిపేవాణ్ని. మావయ్య పాటలు వినిపిస్తే మాత్రం... ఆగకుండా స్టెప్పులేసేవాణ్ని. అవే నన్ను తెరపైకి తీసుకొచ్చాయి'' అన్నారు అల్లు అర్జున్.
ప్రస్తుతం బన్నీ 'ఇద్దరమ్మాయిలతో' చిత్రం చేస్తున్నారు. ఆ సినిమా చిత్రీకరణలో భాగంగా ప్రస్తుతం స్పెయిన్‌లో ఉన్నారు అల్లు అర్జున్. ఆ తరవాత సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో చిత్రం ఉంటుంది. ఆ వరుసలోనే స్టూడియోగ్రీన్ సినిమా చేసే అవకాశాలున్నాయి. ఇది తెలుగుతోపాటు తమిళంలోనూ రూపొందుతుందని తెలిసింది.
ఈ మేరకు దర్శకుడు రాజేష్ తమిళ మీడియాతో మాట్లాడుతూ..నేను అల్లు అర్జున్ కోసం స్క్రిప్టు రెడీ చేస్తున్నాను. త్వరలోనే ఓ షేప్ తీసుకున్న తర్వాత వినిపిస్తాను. నా సినిమాలు అల్లు అర్జున్ చూసి చాలా ఎంజాయ్ చేసానని చెప్పారు. నా కథ అల్లు అర్జున్ కి నచ్చుతుందనే భావిస్తున్నాను అన్నారు.
ఇక ఈ చిత్రం తమిళ,తెలుగు భాషల్లో ఒకే సారి నిర్మాణం కానుంది. గీతా అర్డ్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ నిర్మిస్తారని సమాచారం. ఇక రాజేష్ గతంలో డైరక్ట్ చేసిన ఎస్.ఎమ్ ఎస్ చిత్రం తెలుగులో మహేష్ బాబు బావ సుధీర్ బాబుతో రీమేక్ చేసారు. అలాగే బాస్ ఎనగర్ బాస్కరన్ చిత్రం నేనే అంబాని టైటిల్ తో ఇక్కడ డబ్బింగ్ అయ్యింది. నయనతార,ఆర్య కాంబినేషన్ లో వచ్చిన ఆ చిత్రం తమిళంలో సూపర్ హిట్ గా నమోదైంది.
No comments:
Post a Comment
Thanks for your Comment