Bunny Fans Portal

Visit My New Blog

Wednesday, September 26, 2012

రామ్ చరణ్ దర్శకుడుతో బన్నీ చర్చలు?

 
హైదరాబాద్ : ఆరెంజ్ చిత్రంతో ప్లాప్ లో ఉన్న రామ్ చరణ్ కి రచ్చ చిత్రంతో హిట్ ఇచ్చిన దర్శకుడు సంపత్ నంది. సినిమాలో కొత్తదనం ఏమీ లేకపోయినా,కేవలం అబిమానులు ఆశించే అంశాలును పేర్చి హిట్ కొట్టి మెగా క్యాంప్ ఆదరణ చూరకొన్నారు. ఈ నేపధ్యంలో బన్నీ ఈ దర్శకుడు నేరేట్ చేసిన కథ ఓకే చేసి స్టోరీ డిస్కషన్స్ లో పాల్గొంటున్నాడని సమాచారం. పూరి జగన్నాధ్ తో చేయబోయే ఇద్దరు అమ్మాయిలతో చిత్రం ప్రారంభించేలోగా ఈ సినిమా పై పూర్తి డెశిషన్ తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇక అల్లు అర్జున్ చెప్పిన మార్పులను ఏ రోజు కా రోజు చేస్తూ బన్నీ అభిమానులు సంతృప్తి చెందే విధంగా సినిమా చేయటానికి స్క్రిప్టుని రెడీ చేస్తున్నట్లు ఫిల్మ్ నగర్ సమాచారం.
Sampath Nandi Direct Bunny అయితే పూర్తిగా అభిమానులే సినిమా హిట్ చేస్తారంటే మాత్రం అల్లు అర్జున్ ఒప్పుకోవటం లేదు. ఈ విషయమై ఆయన మాట్లాడుతూ...అభిమానులను సంతృప్తిపరిస్తే చాలు.. విజయాలు అందుకోవచ్చు అనే లెక్కలు కూడా చిత్రసీమలో ఉన్నాయి. ఈ ఆలోచన పూర్తిగా తప్పు! మాస్‌ సినిమాకి ఇప్పుడు అర్థం మారిపోయింది. అందరికీ ఆమోదయోగ్యమైనదే మాస్‌ సినిమా. మూడు వర్గాల ప్రేక్షకుల కోసం సినిమాలు తీస్తారు. ఒకటి యువతరం, రెండు కుటుంబ ప్రేక్షకులు, మూడు అభిమానులు. ఏ ఇద్దరికి నచ్చకపోయినా... సినిమా ఆడనట్టే. అందరికీ నచ్చిన సినిమాని అభిమానులు తమ భుజాలపై మోసి.. మరింత పెద్ద సినిమా చేస్తారు అంటూ మాస్ సినిమా అంటే అర్దం వివరించారు అల్లు అర్జున్.
అల్లు అర్జున్ ఇటీవలే 'జులాయి'గా తెరపైకి వచ్చారు. ఆ సినిమా డివైడ్ టాక్ తెచ్చుకున్నా కలెక్షన్స్ పరంగా బాగుంది. అలాగే మళయాళంలోనూ ఈ చిత్రం మంచి ఓపినింగ్స్ తెచ్చుకుంది. ఈ విషయమై మాట్లాడుతూ... ''నా సినిమాలు మలయాళంలోనూ ఆదరణ పొందడం సంతోషంగా ఉంది. అలాగని నేనేమీ అక్కడి హీరోలకు పోటీగా నిలుస్తున్నాను అనుకోను. నాకంటూ అక్కడో మార్కెట్‌ని ఏర్పరచుకోగలిగాను'' అన్నారు .
ఇక 'జులాయి'తో మరో మెట్టు ఎక్కాను అన్నారు. ఆ మెట్టు త్రివిక్రమ్‌తో సినిమా చేయడమే... ఓ గొప్ప అనుభూతి. నన్ను నటుడిగా ఓ మెట్టుపైకి తీసుకెళ్లారు. సాధారణంగా వాణిజ్య సినిమాల్లో నటనకు పెద్ద ఆస్కారం ఉండదు. నటుడిగా నేను సంతృప్తిపడుతూ, నిర్మాతల్ని ఖుషి చేశానంటే అంత కంటే ఆనందం ఏముంది? ఇది వరకు నా పాత్రల్లో కాస్త చిన్నపిల్లాడి మనస్తత్వం కనిపిస్తుంది. 'జులాయి'లో మాత్రం నా పాత్రను చాలా మ్యాన్లీగా తీర్చిదిద్దారు అని వివరించారు.
 
English Summary
 
Raccha film did set the cash registers ringing and now Sampath Nandi has convinced another mega hero to do the film. He has got a story scripted for Allu Arjun and the news is the actor has given him the green signal to develop it further. It will go to the sets soon.

No comments:

Post a Comment

Thanks for your Comment

Related Posts Plugin for WordPress, Blogger...