Pages

Thursday, May 23, 2013

Varun Tej Following Bunny, Mahesh & Jr NTR Foot Steps

మహేష్, ఎన్టీఆర్, చెర్రీ, బన్నీ...దారిలో వరుణ్ తేజ్
హైదరాబాద్ : మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలంతా దాదాపుగా సక్సెస్ అయ్యారు. తాజాగా మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ కూడా హీరోగా పరిచయం అవ్వడానికి రెడీ అవుతున్నాడు. వరుణ్ తేజ్ కూడా ఇతర మెగా హీరోల్లానే సక్సెస్ అవుతాడనే పూర్తి నమ్మకంతో ఉన్నారు అభిమానులు.చిరంజీవి తనయుడు రామ్ చరణ్ హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి ముందు అతన్ని సక్సెస్ ఫుల్‌గా లాంచ్ చేసే నిర్మాత, దర్శకుడి కోసం మల్లగుల్లాలు పడ్డ మెగా ఫ్యామిలీ చివరకు పూరి జగన్నాథ్‌ను దర్శకుడిగా, అశ్వినీదత్‌ను నిర్మాతగా ఎంపిక చేసారు. ఫలితంగా ‘చిరుత' చిత్రం ద్వారా సక్సెస్ ఫుల్‌గా లాంచ్ అయ్యాడు రామ్ చరణ్. తాజాగా వరుణ్ తేజకు కూడా ఇదే ఫార్ములా అప్లై చేస్తున్నారు మెగా ఫ్యామిలీ మెంబర్స్.నిర్మాత అశ్వినీదత్ చేతుల మీదుగా హీరోగా లాంచ్ అయితే అతను సక్సెస్ ఫుల్ హీరోగా ఎదుగుతాడనే సెంటిమెంటు ఇండస్ట్రీలో బలంగా పాతుకు పోయింది. గతంలో ఆయన ద్వారా వెండి తెరకు పరిచయమైన మహేష్ బాబు, జూ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్‌లే ఇందుకు నిదర్శనం.

No comments:

Post a Comment

Thanks for your Comment