హైదరాబాద్ : అల్లు అర్జున్ హీరోగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో ఓ చిత్రం విజయదసమి రోజు మొదలైన సంగతి తెలిసిందే. లక్ష్మీనరసింహా ప్రొడక్షన్స్ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), డా.వెంకటేశ్వరరావు నిర్మిస్తున్న ఈ చిత్రంపై బన్ని ప్రత్యేక శ్రద్ద చూపిస్తున్నారని సమాచారం. ఈ చిత్రం కోసం పూర్తిగా చాలా రోజులు పాటు డేట్స్ కేటాయించాడని ఫిల్మ్ నగర్ సమాచారం. పూరీతో చేస్తున్న ఇద్దరు అమ్మాయిలతో చిత్రం ఫినిష్ చేసుకుని వచ్చి పూర్తిగా ఈ సినిమాపైనే దృష్టి పెడతానని మాట ఇచ్చారని చెప్పుకుంటున్నారు. ఇద్దరు అమ్మాయిలతో గ్యాప్ లో ఈ చిత్రం షూటింగ్ చేసుకుందామన్నా కాదని డిస్ట్రబన్స్ లేకుండా చేద్దామని చెప్పాడని అంటున్నారు.
నిర్మాత డా.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ " డిసెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడతాం. బన్నితో సినిమా చేయడం హ్యాపీ. సినిమా విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నాను'' అని తెలిపారు. వక్కంతం వంశీ మాట్లాడుతూ "తొలిసారి సురేందర్‌రెడ్డి, బన్ని కాంబినేషన్‌లో సినిమా చేయడం ఆనందంగా ఉంది. పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్‌టైనర్ అవుతుంది'' అని తెలిపారు. ఇక ఈ చిత్రాన్ని బేబి భవ్య సమర్పిస్తున్నారు.
ఇక ఈ చిత్రానికి రేసు గుర్రం అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారు. ప్రకాష్‌రాజ్, బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ, అలీ, రఘుబాబు, కోట శ్రీనివాసరావు, ఆశిష్ విద్యార్థి, ముఖేష్ రుషి, జయ ప్రకాష్‌రెడ్డి, సుహాసిని, ప్రగతి తదితరులు ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: మనోజ్ పరమహంస, సంగీతం: తమన్, ఫైట్స్: విజయ్, నృత్యాలు: రాజు సుందరం, కళ: నారాయణరెడ్డి, కూర్పు: గౌతంరాజు, కథ: వక్కంతం వంశీ, నిర్మాతలు: నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), డా.వెంకటేశ్వరరావు, దర్శకత్వం: సురేందర్‌రెడ్డి.
English Summary
Bunny wanted to give utmost importance to Surender’s project because it involves high budget and a stylish concept. Even Surender Reddy is happy because ‘Iddaru Ammayilatho’ will not intervene into his venture and Bunny could stay determined for a long schedule without any hurry-burry.